పవన్ మెజారిటీ విషయంలో నా అంచనా తప్పేలా ఉంది: రఘురామకృష్ణరాజు
- ఏపీలో నిన్న ప్రభంజనాన్ని తలపించిన పోలింగ్
- పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
- కూటమికి 150కి పైగా స్థానాలు ఖాయమన్న రఘురామ
- గతంలో పవన్ కు 55 వేల మెజారిటీ వస్తుందనుకున్నట్టు వెల్లడి
- నిన్నటి ఊపు చూస్తే 65 వేల మెజారిటీ తథ్యమని వ్యాఖ్యలు
ఏపీలో పోలింగ్ సరళి చూశాక తన అభిప్రాయం మార్చుకుంటున్నానని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. కూటమికి మరిన్ని స్థానాలు వస్తాయని అన్నారు. 150కి పైగా ఎమ్మెల్యే స్థానాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు, మెజారిటీల విషయంలోనూ తన అంచనాలను సవరిస్తున్నానని రఘురామ తెలిపారు. నెలకిందట పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లానని, 50 వేల నుంచి 55 వేల మెజారిటీ వస్తుందనుకున్నానని, కానీ తన అంచనా తప్పేలా ఉందని, పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో 65 వేల వరకు మెజారిటీ రావడం ఖాయమని అన్నారు. కొన్ని బూత్ లలో 80 శాతం పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఓటింగ్ జరిగినట్టు తెలిసిందని వెల్లడించారు.
కుప్పంలో చంద్రబాబు కూడా 60 వేల మెజారిటీతో గెలవబోతున్నారని రఘురామ స్పష్టం చేశారు. చంద్రబాబును ఓడించడానికి ఓటుకు 4 వేలు, 5 వేలు ఇచ్చారంటున్నారని, ఏమిచ్చినా చంద్రబాబు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఉద్ఘాటించారు.
సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. తనకు కన్నా, రాంబాబు ఇద్దరూ స్నేహితులేనని, కానీ తనకున్న సమాచారం మేరకు అంచనాలను వెలువరిస్తున్నానని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్ సైడ్ అని, కూటమి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమని రఘురామ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరిలో అందరూ నెగ్గుతారని వెల్లడించారు. అయితే ఇవన్నీ కరెక్టా, కాదా అనేది జూన్ 4న తెలుస్తుందని పేర్కొన్నారు. తన అంచనాలు కచ్చితంగా నిజమవుతాయని నమ్ముతున్నట్టు వివరించారు.