ఘోరం.. టోల్ ఫీజు అడిగినందుకు మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు!
- ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద ఘటన
- ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలన్న సిబ్బంది
- టోల్ ప్లాజా స్టాఫ్‌తో వాగ్వాదానికి దిగిన వాహనదారుడు
- దుర్భాషలాడుతూ వాహనం ముందు నిల్చున్న మహిళపైకి దూసుకెళ్లిన వైనం
టోల్ ఫీజు అడిగినందుకు ఓ వాహనదారుడు అక్కడి మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు. దాంతో కారు డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుర్భాషలాడుతూ వాహనం ముందు నిల్చున్న మహిళపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది.
"ఢిల్లీ నుంచి వచ్చిన వాహనదారుడు మా టోల్ ప్లాజా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. టోల్ ఫీజు అడిగినందుకు మా సిబ్బందిని కారుతో పాటు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో మహిళా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి" అని కాశీ టోల్ ప్లాజా మేనేజర్ అనిల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ షాకింగ్ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.