ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు!
- విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు
- నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు
- ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు
డీజీపీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఆయనతో పాటు, ఆయన భార్య కవితల ఓట్లను తొలగించడమే దీనికి కారణం. ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నారు. నిన్న ఉదయం ఏబీ దంపతులు ఓటు వేయడానికి లయోలా కాలేజ్ ప్రాంగణంలోని 59వ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
అయితే, ఓటర్ల జాబితా నుంచి ఇద్దరి ఓట్లను తొలగించినట్టుగా ఉందని వారికి అధికారులు తెలిపారు. వారి పేర్లు ఉన్న చోట 'డిలీటెడ్' అని ఉందని ఆయనకు అధికారులు చూపించారు. దీంతో, వారు పోలింగ్ బూత్ నుంచి తిరిగి వచ్చేశారు. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఓటును తొలగించడం గమనార్హం. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కూడా తన ఓటు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.