ఏపీలో ముగిసిన పోలింగ్ సమయం

  • ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు
  • 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
  • సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • అనేక పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకు పోలింగ్
ఏపీలో ఇవాళ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయంగా నిర్దేశించారు. ఈసీ పేర్కొన్న మేరకు ఏపీలో పోలింగ్ సమయం ఈ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. 

అయితే, పోలింగ్ ముగింపు సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. ఓటర్లు ఇంకా క్యూలైన్లలో ఉన్నందున అనేక పోలింగ్ బూత్ లలో రాత్రి వరకు పోలింగ్ చేపట్టనున్నారు.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ జరుపుతున్నారు. ఏపీ గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది.


More Telugu News