ఓటేసిన మహేశ్ బాబు, రామ్ చరణ్ దంపతులు!
- జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేసిన మహేశ్ బాబు దంపతులు
- జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్, ఉపాసన
- ఓటు బరువు కాదని... బాధ్యతగా భావించాలన్న రామ్ చరణ్
ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. మహేశ్ దంపతులు స్కూల్‌లోకి వెళుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహేశ్ బాబును చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు.
జూబ్లీక్లబ్‌లో సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ... అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఓటును బరువుగా భావించవద్దని... ఇది బాధ్యత అన్నారు. ఇళ్లలో ఉన్న యువత బయటకు వచ్చి ఓటు వేయాలన్నారు.