తాడిపత్రిలో వైసీపీ చేస్తున్న మారణహోమం చూసి ఆవేదన కలుగుతోంది: నారా లోకేశ్
- తాడిపత్రిలో పోలింగ్ హింసాత్మకం
- జగన్ కోరలు పీకే సమయం వచ్చిందన్న నారా లోకేశ్
- ఈ అల్లరి మూకలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొడతామని హెచ్చరిక
తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య పండుగైన ఓటింగ్ రోజు కూడా తాడిపత్రిలో వైసీపీ మారణహోమం చూసి ఆవేదన కలుగుతోందని పేర్కొన్నారు. టీడీపీకి అనుకూల ఓటింగ్ పడుతోందని పోలీసులను కూడా కొడుతున్న వీళ్లా మన నేతలు? అంటూ ఆక్రోశించారు.
"ఇలాంటి ఫ్యాక్షన్ పోకడలను పెంచి పోషిస్తున్న జగన్ కోరలు పీకే సమయం వచ్చింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ అల్లరి మూకలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొడతాం" అని నారా లోకేశ్ హెచ్చరించారు.