ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యం... ఓటుతోనే మార్పు తీసుకురావొచ్చు: బండారు దత్తాత్రేయ
- హైదరాబాద్‌లోని రామ్ నగర్ పోలింగ్ బూత్‌లో ఓటేసిన హర్యానా గవర్నర్
- ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాలని పిలుపు
- ప్రజలు తమ మనస్సాక్షి ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవాలన్న దత్తాత్రేయ
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని... ఓటుతోనే మార్పును తీసుకురావొచ్చునని కేంద్ర మాజీ మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని రామ్ నగర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు. ప్రజాస్వామ్యంలో కోటీశ్వరుడైనా... ధనవంతుడైనా ఓటు హక్కు కలిగి ఉంటారన్నారు. ప్రజలు తమ మనస్సాక్షి ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తెలంగాణలో ప్రజలంతా బయటకు వచ్చి ఓటు వేస్తున్నారన్నారు.