'ఆవేశం' అందుకే అంతపెద్ద హిట్!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'ఆవేశం'
  • 150 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సినిమా
  • ఫహాద్ ఫాజిల్ నటన హైలైట్  

మలయాళంలో ఫహాద్ ఫాజిల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన తాజా చిత్రంగా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆవేశం' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్ లో రూపొందింది. అయితే చాలా వేగంగా ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అలాంటి సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో మళయాళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే .. ఓ ముగ్గురు స్నేహితులు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయడానికి కేరళ నుంచి బెంగుళూర్ వెళతారు. అక్కడి సీనియర్ స్టూడెంట్స్ ఈ ముగ్గురిని చాలా దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. సీనియర్స్ కి తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో, లోకల్ రౌడీ రంగాను ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఆశ్రయిస్తారు. రంగా ఆ సీనియర్స్ ను తనదైన స్టైల్లో భయపెడతాడు. దాంతో రంగా తాలూకు మనుషులుగా కాలేజ్ లో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కి పేరు పడుతుంది. 

మొదట్లో అదో గొప్ప విషయంగా అనిపించినా, ఆ తరువాత అదే వారిని ఇబ్బంది పెట్టడం మొదలెడుతుంది. రంగాకి ప్రేమ ఎక్కువైనా .. కోపం ఎక్కువైనా అది తీవ్ర రూపం దాలుస్తుంది. అతనిలోని ఆ ధోరణి ఈ ఫ్రెండ్స్ ను ఎలా తిప్పలు పెట్టిందనేదే కథ. మొదటి నుంచి చివరివరకూ నాన్ స్టాప్ నవ్వులు కురిపించడాం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి హిట్ కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News