ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌

  • కొడంగ‌ల్‌లోని హైస్కూల్‌లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి దంప‌తులు
  • భార్య గీతా రెడ్డితో పాటు కూతురు నీమిషాతో క‌లిసి పోలింగ్ సెంట‌ర్‌కు వెళ్లిన సీఎం
  • అలాగే వేర్వేరు చోట్ల‌లో ఓటు వేసిన‌ పలువురు కాంగ్రెస్ నేత‌లు, మంత్రులు  
  • చింత‌మ‌డ‌క‌లో ఓటు వేసిన మాజీ సీఎం కేఆసీర్‌ దంప‌తులు 
నాలుగో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌లలో భాగంగా తెలంగాణలో పోలింగ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులు కొడంగ‌ల్‌లోని హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో త‌మ ఓటు వేశారు. రేవంత్ త‌న భార్య గీతా రెడ్డితో పాటు కూతురు నీమిషాతో  క‌లిసి పోలింగ్ సెంట‌ర్‌కు వెళ్లి ఓటు వేశారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేత‌లు, మంత్రులు కూడా త‌మ హ‌క్కు వినియోగించుకున్నారు. 

ఇలా ఓటు వేసిన వారిలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మంత్రి సీత‌క్క‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరిలో కోమ‌టిరెడ్డి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న‌ల్గొండ‌లో ఓటు వేశారు. పొన్నం ప్ర‌భాక‌ర్ ఆర్టీసీ బ‌స్సులో వెళ్లి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. సూర్యా‌పేట జిల్లా కోదాడ‌లో ఉత్త‌మ్‌, క‌ల్లూరు మండ‌లం నారాయ‌ణ‌పూరంలో మంత్రి పొంగులేటి, ములుగు జిల్లా జ‌గ్గ‌న్న‌పేట‌లో మంత్రి సీత‌క్క‌, మ‌ధిర‌లో భ‌ట్టి విక్ర‌మార్క గొల్ల‌గూడెంలో మంత్రి తుమ్మ‌ల తమ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. 


చింత‌మ‌డ‌క‌లో ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌
తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చింత‌మడ‌క‌లో ఓటు వేశారు. త‌న భార్య శోభ‌తో క‌లిసి చింత‌మ‌డ‌క పోలింగ్ కేంద్రానికి వెళ్లి కేసీఆర్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అటు నాగ‌ర్‌క‌ర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అలంపూర్‌లో ఓటు వేశారు. ప‌ట్ట‌ణంలోని హ‌రిజ‌న‌వాడ ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో ప్ర‌వీణ్ కుమార్ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.


More Telugu News