ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూత

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
  • అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూనగర్‌ లో ఘటన
  • పోలింగ్ బూత్ లోనే కన్నుమూసిన శ్రీకృష్ణ
లోక్ సభ ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి పోలింగ్ బూత్ లో సడెన్ గా కుప్పకూలాడు. తోటి ఉద్యోగులు, ఓటర్లు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే తుదిశ్వాస వదిలాడు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషాదం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. 

అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూ నగర్ పోలింగ్ బూత్ లో శ్రీకృష్ణ అనే ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ ఏర్పాట్లలో ఉన్న శ్రీకృష్ణ.. ఓటింగ్ మొదలయ్యాక జనాలకు ఇబ్బంది కలగకుండా, పోలింగ్ సాఫీగా జరిగేలా చూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గుండె నొప్పితో పడిపోయిన శ్రీకృష్ణకు సపర్యలు చేసిన మిగతా ఉద్యోగులు.. ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయాడని, మరణానికి కారణం గుండెపోటు అని తెలిపారు.


More Telugu News