యాక్టింగ్ వైపు వస్తాననేవారికి ఒకటే మాట చెబుతాను: 'జబర్దస్త్' అదిరే అభి
- జబర్దస్త్ తో అదిరే అభికి మంచిపేరు
- సినిమాల్లో అవకాశాలు రాలేదని వెల్లడి
- పదేళ్లపాటు జాబ్ చేశానని వివరణ
- చదువు పూర్తయిన తరువాతే యాక్టింగ్ వైపు వెళ్లాలని వ్యాఖ్య
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. అలాంటివారి జాబితాలో అదిరే అభి కూడా కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. అందువలన నేను సినిమాల వైపు వచ్చాను. పల్లెటూర్లో ఉంటూ సినిమాలను గురించి మనం అనుకునేది వేరు .. ఇక్కడికి వచ్చిన తరువాత మనకి కనిపించేది వేరు" అని అన్నాడు.
" సినిమాలలో అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నేను జాబ్ వైపు వెళ్లిపోయాను. 10 ఏళ్ల పాటు నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ .. టీవీ షోస్ చేస్తూ కెరియర్ ను కొనసాగించాను. ఆఫీస్ లో మా బాస్ సహకరించడం వల్లనే ఇది సాధ్యమైంది. నాకు ఇద్దరు పిల్లలు .. ప్రస్తుతానికి చదువుపైనే దృష్టిపెట్టమని చెప్పాను. యాక్టింగ్ అంటే ఇష్టమా లేదా అనేది కూడా నేను అడగలేదు" అని చెప్పాడు.
"యాక్టింగ్ అంటే ఇష్టమని నాతో ఎవరు చెప్పినా, ముందుగా చదువు పూర్తిచేయమని చెబుతాను. ముందుగా చదువుకోవాలి .. ఆ తరువాత ఆర్ధిక పరమైన భద్రత కోసం డబ్బు సంపాదించుకోవాలి. ఆ తరువాత నటన వైపు రావొచ్చు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయ్యేవారు చాలా తక్కువమంది. సక్సెస్ కాలేకపోతే బయటికి వెళ్లి ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలా అయోమయంలో పడిపోయినవారిని నేను చాలామందిని చూశాను" అని అన్నాడు.