'దేశ భవిష్యత్తు.. మన బాధ్యత'.. సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

  • ప్ర‌తిఒక్క‌రూ ఓటు వేయాల‌ని సీఎం రేవంత్‌ పిలుపు
  • యువ‌త త‌ప్ప‌కుండా ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని సూచన‌
  • ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ఓటుతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని వ్యాఖ్య‌
  • మ‌న బాధ్య‌త నిర్వ‌ర్తించిన‌ప్పుడే హ‌క్కుల కోసం ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంటుందన్న రేవంత్ రెడ్డి  
తెలంగాణలో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల నుంచే పోలింగ్ ప్రారంభం కావ‌డంతో ఓటు వేసేందుకు ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంది. ఇక రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ పోలింగ్ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

దేశ భ‌విష్య‌త్తు మ‌న బాధ్య‌త‌.. ఓటు వేయ‌డంపై నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని.. ప్ర‌తిఒక్క‌రూ ఓటు వేయాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. సోమ‌వారం ఉద‌యం ట్వీట్ చేసిన రేవంత్‌.. ప్ర‌జాస్వామ్య ర‌క్ష‌ణ‌లో మీ పాత్ర పోషించాలి. యువ‌త‌కు మరీ మ‌రీ చెబుతు‌న్నా.. మీ ఓటు హ‌క్కు త‌ప్ప‌కుండా వినియోగించుకోండి అని సూచించారు. భార‌త ప్ర‌జాస్వామ్యం పటిష్ఠంగా ఉండ‌టానికి ఓటే పునాది అని అన్నారు. ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ఓటుతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఓటు మ‌న హ‌క్కు మాత్ర‌మే కాద‌ని, బాధ్య‌త కూడా అని సీఎం గుర్తు చేశారు. మ‌న బాధ్య‌త నిర్వ‌ర్తించిన‌ప్పుడే హ‌క్కుల కోసం ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


More Telugu News