ఉత్తర కొరియాలో ఎర్రటి లిప్ స్టిక్ పై నిషేధం.. ఎందుకంటే..!
- రెడ్ లిప్ స్టిక్ వేసుకొనే మహిళలు మరింత ఆకర్షణీయంగా ఉంటారని తేల్చిన కిమ్ ప్రభుత్వం
- దేశ ప్రజలు ఆర్భాటాలు లేకుండా జీవించాలన్న దేశ వైఖరికి ఇది విరుద్ధమని ప్రకటన
- ఇప్పటికే ఆ దేశంలో అమలవుతున్న ఎన్నో ఆంక్షలు
ఉత్తర కొరియా పేరు చెప్పగానే అందరికీ దశాబ్దాలుగా కొనసాగుతున్న నియంతృత్వం గుర్తొస్తుంది. అక్కడ అమలవుతున్న కఠిన చట్టాలు, నిబంధనలు, శిక్షలను కిమ్ జాంగ్ ఉన్ తన పాలనలో మరింతగా పెంచారు. తాజాగా దేశంలో రెడ్ లిప్ స్టిక్ ను నిషేధించారు.
ఎందుకంటే..
సాధారణంగా ఎర్ర రంగు కమ్యూనిజానికి చిహ్నం. చరిత్రలో ఆ రంగుకు, కమ్యూనిస్టులకు విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టు భావాలుగల ఉత్తర కొరియాకు మాత్రం రెడ్ లిప్ స్టిక్ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంకేతమట! మహిళలు ఎర్ర రంగు లిప్ స్టిక్ వేసుకుంటే వారు మగవారిని మరింత ఎక్కువగా ఆకర్షిస్తారని కిమ్ ప్రభుత్వం తేల్చిపారేసింది. దేశ ప్రజలు హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా జీవించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది విరుద్ధమని సూత్రీకరించింది. అందుకే రెడ్ లిప్ స్టిక్ వాడకంపై ఏకంగా నిషేధం విధించింది. అతివల భారీ మేకప్ పై ప్రభుత్వం గతంలోనే కన్నెర్ర జేసింది. పశ్చిమ దేశాల వేషధారణ, ఫ్యాషన్ల ప్రభావం దేశంపై ఉండకూడదని నిర్ణయించింది.
ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్లు, కాస్మొటిక్ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. కొన్నేళ్ల కిందట స్కిన్ ఫిట్ జీన్స్, టాటూలు, ఆడ, మగవారికి కొన్ని రకాల హెయిర్ స్టయిల్స్ ను నిషేధించింది. ముఖ్యంగా దేశాధ్యక్షుడు కిమ్ హెయిర్ స్టయిల్ ను ఎవరూ కాపీ కొట్టకూడదంటూ మగవారిపై నిషేధం పెట్టింది. అలాగే ఆయన ధరించే నల్ల కోటును పోలిన కోటును ఎవరూ ధరించరాదని తీర్మానించింది. నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసులను కూడా నియమించింది. దీన్ని ఉల్లంఘించిన ప్రజలకు భారీ జరిమానాలు, శిక్షలు కూడా విధిస్తోంది.