నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. భారీగా పతనమవుతున్న టాటా మోటార్స్ షేరు విలువ
- మార్కెట్లపై ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ ప్రతికూలతలు
- 468 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 119 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఈరోజు దేశ వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.25 గంటల సమయంలో సెన్సెక్స్ 468 పాయింట్లు నష్టపోయి 72,196 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 21,935 వద్ద కొనసాగుతోంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్ల వరకు పతనమయింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. హెల్త్ కేర్, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా ఇతర అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటోమొబైల్, పీఎస్యూ, ఎనర్జీ సూచీలు ఎక్కువగా నష్టపోతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టాటా మోటార్స్ షేరు విలువ ఎనిమిదిన్నర శాతం వరకు పతనమయింది. ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్ తదితర కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఏసియన్ పెయింట్స్ షేర్లు దాదాపు 3 శాతం వరకు లాభపడ్డాయి. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.