కింగ్ కోహ్లీ, లంబూ ఇషాంత్ ల బ్రొమాన్స్ చూశారా.. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా
- ఆర్సీబీ డీసీ జట్ల మధ్య మ్యాచ్ లో సరదా సన్నివేశం
- ఒకరినొకరు ఆటపట్టించుకున్న కోహ్లీ, ఇషాంత్ శర్మ
- నెట్టింట వీడియో వైరల్.. మురిసిపోయిన ఫ్యాన్స్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో కింగ్ కోహ్లీ, ‘లంబూ’ ఇషాంత్ శర్మల మధ్య బ్రొమాన్స్ అదిరింది. పశ్చిమ ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకోవడం ఫ్యాన్స్ తోపాటు ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తింది. గతంలో కోహ్లీ కెప్టెన్సీలోనే ఇషాంత్ టెస్టులు, వన్డేలు ఆడడంతో వారి చిలిపి అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు పోస్ట్ చేశారు.
తొలుత బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు దిగగా ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ ఇషాంత్ బౌలింగ్ లో ఓ ఫోర్, సిక్స్ బాదాడు. స్లిప్ లో ఫీల్డర్లు లేకపోవడంతో విరాట్ కొట్టిన బంతి కీపర్ పక్క నుంచి బౌండరీకి వెళ్లింది. అప్పుడు ఇషాంత్ వద్దకు వచ్చిన కోహ్లీ.. స్లిప్ లో ఆటగాడిని పెట్టుకోవాలని సరదాగా సూచించాడు. ఆ తర్వాత ఇషాంత్ వేసిన మరో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అయితే అదే ఓవర్ లో నాలుగో బంతికి కోహ్లీని ఇషాంత్ అవుట్ చేశాడు. బ్యాట్ అంచుకు తగిలిన బంతి కీపర్ చేతులోకి వెళ్లడంతో ఇషాంత్ సంబరాలు చేసుకున్నాడు. క్రీజ్ నుంచి డ్రెస్సెంగ్ రూమ్ వైపు వెళ్తున్న కోహ్లీకి అడ్డంపడి నవ్వుతూ గేలి చేశాడు. దీంతో కోహ్లీ తలవంచుకొని కాస్త నవ్వుతూనే వెనుదిరిగాడు.
బెంగళూరు విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు 140 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే 18వ ఓవర్ లో 9వ వికెట్ పడ్డాక ఇషాంత్ శర్మ బ్యాటింగ్ కు రావడంతో కోహ్లీ అతన్ని సరదాగా ఎగతాళి చేశాడు. ఇషాంత్ క్రీజులోకి రాగానే అతని వద్దకు వెళ్లి ఆటపట్టించాడు. అలాగే 18వ ఓవర్ ముగిశాక కూడా అతన్ని సరదాగా నెడుతూ గేలి చేశాడు. 19వ ఓవర్లో తొలి బంతికే కుల్ దీప్ యాదవ్ ను యష్ దయాల్ బౌల్డ్ చేయడంతో ఢిల్లీ పోరాటం ముగిసింది.