ప్రజ్వల్ రేవణ్ణ కేసు.. అసభ్య వీడియోలను సోషల్ మీడియాకెక్కించిన ఇద్దరు బీజేపీ కార్యకర్తల అరెస్ట్
- ప్రజ్వల్ రేవణ్ణ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్
- నిందితులను వారి నివాసాల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు
- వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచిన వైనం
జేడీఎస్ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. ప్రజ్వల్ అసభ్య వీడియోలను లీక్ చేసి అవి జనంలోకి వెళ్లేలా చేసిన ఇద్దరు బీజేపీ కార్యకర్తలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు చేతన్, లికిత్ గౌడను యెలగుండ, శ్రావణబెళగొళలోని వారి నివాసాల్లో అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు పరచడానికి ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఏప్రిల్ 26న తొలి దశ ఎన్నికలు జరగ్గా, అంతకు కొన్ని రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ అసభ్య వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 2,900 అసభ్య వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌లు నియోజకవర్గ వ్యాప్తంగా లభించాయి. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ బరిలో ఉన్న హసన్ జిల్లాలో తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి.