ఓటు వేసిన నారా లోకేశ్ దంపతులు.. ఓటర్లకు సందేశంతో కూడిన ట్వీట్
- మంగళిగిరిలో ఓటు వేసిన లోకేశ్, బ్రాహ్మణి
- మార్పు కావాలని కోరుకోవడం కాదు మార్పు మనతోనే మొదలుకావాలన్న లోకేశ్
- తరలి వచ్చి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపు
తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో బూలింగ్ బూత్‌లకు తరలివెళ్తున్నారు. ఇక ప్రముఖులు సైతం ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రాహ్మణి మంగళిగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు.
కాగా ఏపీలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా నారా లోకేశ్ స్పందించారు. ప్రజలే ప్రజాస్వామ్యం బలం, బలగం అని వ్యాఖ్యానించారు. ‘‘మార్పు కావాలని కోరుకోవడం కాదు మార్పు మనతో మొదలుకావాలి. మీ ఓటుతోనే భవిష్యత్తు ముడిపడి ఉంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ఓటర్లకు తన సందేశాన్ని ఇచ్చారు. కాగా మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు దంపతులు కూడా ఓటు వేశారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు కూడా ఉదయాన్నే ఓటు వేశారు. ఉదయాన్నే ఓటు వేసిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారు.