తెలుగు రాష్ట్రాల్లో మొదలైన మాక్ పోలింగ్
- ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న పోలింగ్ బూత్ సిబ్బంది
- ఈ ప్రక్రియ ముగియగానే ఓటింగ్
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైంది. ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బూత్‌ల సిబ్బంది ఈవీఎంల పనితీరుని పరిశీలిస్తున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం అసలుసిసలైన ఓటింగ్ ప్రక్రియ షురూ కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ కొనసాగనుంది. అయితే నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసిపోనుంది.
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లకు, తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లకే నేడు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఏపీలో ఎన్నికల సమాచారం విషయానికి పార్లమెంట్ బరిలో 454 మంది అభ్యర్థులు, అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887 కోట్లుగా ఉంది. అందులో పురుషులు - 2,03,39,851, మహిళలు - 2,10,58,615, థర్డ్ జెండర్ - 3,421గా ఉన్నారు. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు - 46,389 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 12,438గా ఉన్నాయి. మొత్తం 34,651 (74.7 శాతం) పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.