మే 14న నామినేషన్ వేస్తున్న ప్రధాని మోదీ... చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం
- లోక్ సభ ఎన్నికల్లో వారాణాసి నుంచి బరిలో దిగుతున్న ప్రధాని మోదీ
- ఎల్లుండి నామినేషన్
- చంద్రబాబుకు ఆహ్వానం పంపిన ప్రధాని
- మోదీ నామినేషన్ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మోదీ ఎల్లుండి (మే 14) నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఎన్డీయే కూటమి భాగస్వామి చంద్రబాబుకు కూడా మోదీ ఆహ్వానం పంపించారు.
ఏపీలో రేపు ఎన్నికలు జరగనుండగా, చంద్రబాబు ఎల్లుండి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్లనున్నారు. అక్కడ మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని, ఎన్డీయే మిత్ర పక్షాల సభలో మోదీతో పాల్గొని ప్రసంగించనున్నారు . అనంతరం విజయవాడ తిరిగిరానున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు. 2014లో చేయి చేయి కలిపిన చంద్రబాబు, మోదీ... 2019కి వచ్చేసరికి విడిపోయారు. మళ్లీ 2024 వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది.
చంద్రబాబును తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించిన మోదీ... టీడీపీ అధినేతను తన ప్రియ మిత్రుడు అంటూ సంబోధించి తమ మైత్రిని చాటారు. తాజాగా తన నామినేషన్ కు చంద్రబాబును ఆహ్వానించడం ద్వారా కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేశారు.