మరోసారి ఆకట్టుకున్న రజత్ పాటిదార్... ఆర్సీబీ భారీ స్కోరు
- చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసిన ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో యువ బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్ ఒకడు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ పాటిదార్ బ్యాట్ ఝళిపించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 6 పరుగులకే అవుట్ కాగా, కోహ్లీ 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో వచ్చిన రజత్ పాటిదార్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేశాడు. విల్ జాక్స్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కాగా, ఈ ఇన్నింగ్స్ లో ఢిల్లీ ఫీల్డర్లు అనేక క్యాచ్ లు జారవిడవడం బెంగళూరుకు లాభించింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, రసిక్ సలామ్ 2, ఇషాంత్ శర్మ 1, ముఖేశ్ కుమార్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.
ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. పంత్ స్థానంలో అక్షర్ పటేల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.