ఆర్ఆర్ ను ఓడించి రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్

  • చెన్నైలో సీఎస్కే × రాజస్థాన్ రాయల్స్
  • 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ ను ఓడించిన సీఎస్కే
  • 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించిన వైనం
  • జట్టును ముందుండి నడిపించిన చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జూలు విదిల్చింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 5 వికెట్లతో ఘనవిజయాన్ని అందుకుంది. 

మొదట రాజస్థాన్ రాయల్స్ ను 141/5 స్కోరుకే కట్టడి చేసిన చెన్నై జట్టు... 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులు (నాటౌట్) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర 27, డారిల్ మిచెల్ 22 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, నాండ్రే బర్గర్ 1, చహల్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ జట్టు ఇవాళ గెలిచి ఉంటే ప్లే ఆఫ్ బెర్తు అధికారికంగా ఖరారయ్యేది. 

డబుల్ హెడర్... రెండో మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తుండడం తెలిసిందే. రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.


More Telugu News