వెజ్ రేటు పెరిగింది.. నాన్ వెజ్ రేటు తగ్గింది.. దేని ఖర్చెంత?
- ఇంట్లో వండుకునే భోజనం సగటు ఖర్చును లెక్కేసిన క్రిసిల్
- సుమారు ఏడాదిన్నరగా ఉన్న ధరలతో అంచనాలు
- ఏ నెలలో శాఖాహారానికి, మాంసాహారానికి ఎంత ఖర్చవుతుందోననే లెక్కలతో నివేదిక
హోటల్ కు వెళితే వందలు, వేలల్లో బిల్లులు కట్టాల్సిందే. అదే మన ఇంట్లో వండుకునే భోజనానికి పెద్దగా ఖర్చు కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక్కో ప్లేట్ భోజనానికి ఇంట్లో ఎంత ఖర్చవుతుందనేది తెలుసా? అందులోనూ కొంతకాలం నుంచి మాంసాహారం ఖర్చు తగ్గుతూ.. శాఖాహారం ఖర్చు స్వల్పంగా పెరుగుతోంది తెలుసా? ప్రఖ్యాత క్రిసిల్ సంస్థ ఈ మేరకు లెక్కలు వేసింది.
ఏప్రిల్ దాకా అయ్యే ఖర్చుతో మే నివేదిక..
క్రిసిల్ సంస్థ మార్కెట్లో ధరల ఆధారంగా ప్రతినెలా ప్లేట్ భోజనానికి అయ్యే ఖర్చును లెక్కిస్తూ ఉంటుంది. దీన్ని వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ ఖర్చు కింద చూపిస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ వరకు ఖర్చులకు సంబంధించి తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
నూనెలు, వంటగ్యాస్, మసాలాలు వంటివి శాఖాహారం, మాంసాహారం రెండింటిలోనూ వినియోగిస్తారు. కాబట్టి.. వాటిని రెండింటిలోనూ ఖర్చు చూపుతారు. ఇక నాన్ వెజ్‌కు సంబంధించి చికెన్, గుడ్ల ధరలను అదనంగా జత చేశారు. వెజ్‌కు సంబంధించి టమాటా, బంగాళదుంపలు, పప్పులు, కూరగాయల ధరలను లెక్కించారు.
స్వల్పంగా పెరిగిన శాఖాహార ఖర్చు..
మాంసాహారం, శాఖాహార థాలీ సగటు ధరల లెక్క ఇదీ..
ఏడాదిలో నెల మాంసాహార ఖర్చు శాఖాహార ఖర్చు

- 2023 ఏప్రిల్ నాటి రేట్లతో.. ఈ ఏడాది ఏప్రిల్ నాటి రేట్లను క్రిసిల్ సంస్థ లెక్కలోకి తీసుకుంది.
- ఈ రెండు సమయాల్లో శాఖాహార, మాంసాహార భోజన ఖర్చులను పోల్చింది. ఈ ఏడాది కాలంలో వెజ్ ఖర్చు ఎనిమిది శాతం మేర పెరగ్గా.. నాన్ వెజ్ ఖర్చు 4శాతం మేర తగ్గింది.
- ఎందుకంటే ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలు, కొన్నిరకాల కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో వెజ్ ఖర్చు పెరిగిందని తెలిపింది.
- చికెన్ ధరలు కాస్త తగ్గడంతో నాన్ వెజ్ ఖర్చు కాస్త తగ్గిందని వెల్లడించింది.
మాంసాహారం, శాఖాహార థాలీ సగటు ధరల లెక్క ఇదీ..
ఏడాదిలో నెల మాంసాహార ఖర్చు శాఖాహార ఖర్చు
- 2022 డిసెంబర్ రూ.60.1 రూ.26.6
- 2023 జనవరి రూ.59.9 రూ.26.6
- ఫిబ్రవరి రూ.59.2 రూ.25.6
- మార్చి రూ.59.2 రూ.25.5
- ఏప్రిల్ రూ.58.9 రూ.25.4
- మే రూ.59.9 రూ.25.5
- జూన్ రూ.60.5 రూ.26.7
- జూలై రూ.67.8 రూ.34.1
- ఆగస్టు రూ.67.5 రూ.34.0
- సెప్టెంబర్ రూ.60.7 రూ.28.1
- అక్టోబర్ రూ.58.6 రూ.27.7
- నవంబర్ రూ.60.4 రూ.30.5
- డిసెంబర్ రూ.56.4 రూ.29.7
- 2024 జనవరి రూ.52.0 రూ.28.0
- ఫిబ్రవరి రూ.54.0 రూ.27.5
- మార్చి రూ.54.9 రూ.27.3
- ఏప్రిల్ రూ.56.3 రూ.27.4