పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విధ్వంసం.. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు.. వీడియో ఇదిగో!
- పన్ను రహిత విద్యుత్, గోధుమపిండిపై సబ్సిడీ కోసం సమ్మెకు పిలుపునిచ్చిన జేకేజేేేేేేేఏఏసీ
- ఆందోళనకారులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, భద్రతా దళాలు
- హింసాత్మకంగా మారిన ఘర్షణలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారుల చేతుల్లో చిక్కుకున్న పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పీవోకేలోని దద్యాల్, మీర్పూర్, సమహానీ, సెహన్సా, రావల్‌కోట్, ఖుయిరట్టా, టప్పాపానీ, హట్టియన్ బాలా సహా ఇతర ప్రాంతాల్లో ఆందోళనకారులు, భద్రతాధికారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
మంగ్లా డ్యామ్ నుంచి పన్ను రహిత విద్యుత్, గోధుమపిండిపై సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ షట్టర్ డౌన్, వీల్ జామ్ (జేకేజేఏఏసీ) సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళనలు రేకెత్తాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి తుపాకులు పేల్చారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. పలువురు ఆందోళనకారులు భద్రతా సిబ్బందిని పట్టుకుని కర్రలతో చితకబాదారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు పాకిస్థాన్ రేంజర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్ నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నారు.