చేతిలో ఓటరు లిస్ట్.. జేబులో డబ్బుల కట్టలు.. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన యువకులు.. వీడియో ఇదిగో!
- మెదక్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి, రామచంద్రాపురంలో డబ్బుల పంపకం
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానిక యువకులు
- వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వైనం
ఎన్నికలకు ఒక్క రోజు ముందు ప్రలోభాలు మొదలయ్యాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో పార్టీలు తలమునకలయ్యాయి. మెదక్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, రామచంద్రాపురంలో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. చేతిలో ఓటరు జాబితా పట్టుకుని తిరుగుతున్న వారు జేబుల్లో నోట్ల కట్టలు పెట్టుకుని ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
దొరికినవారు బీఆర్ఎస్‌కు చెందినవారేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెదక్ బరిలో బీఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు ఉన్నారు. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొని ఉండడంతో రాష్ట్ర ప్రజల దృష్టి దీనిపైనే ఉంది.