హిందూ మహా సముద్రంలో ‘టెంపరేచర్‌’ బాంబు.. జరగబోయే విధ్వంసం ఇదే!

  • హిందూ మహాసముద్రంలో మెరైన్ హీట్‌వేవ్
  • ప్రకృతి మాడిమసైపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన
  • అయితే వేడి, లేదంటే వానలతో బీభత్సం తప్పదని హెచ్చరిక
భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం పెను ప్రమాదంలో పడింది. అది భారతదేశంపైనా తీవ్ర ప్రభావం చూపబోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అణుబాంబు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అది పుట్టించే వేడిని ఊహించలేం. అలాంటిది పదేళ్లపాటు ఆగకుండా అణుబాంబులు కురిస్తే ఎంత వేడి ఉత్పన్నం అవుతుందో అంతటి వేడికి హిందూ మహాసముద్రం గురికాబోతోందట. 

వేడెక్కిన సముద్ర జలాల ప్రభావం మన దేశంపైనా పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వేడి ధాటికి పచ్చని ప్రాంతాలన్నీ మాడిమసైపోతాయి. గత నాలుగు దశాబ్దాలుగా వాతావరణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు వేసిన అంచనా ఇది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ (ఐఐటీఎం) అధ్యయనం ప్రకారం మెరైన్ హీట్ ‌వేవ్ సమస్య అంతకంతకూపెరుగుతోంది. దీనివల్ల ఈ భూగోళంపై పడే ప్రభావం అంతాఇంతా కాదట. మరి ఆ ఉపద్రవాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.





More Telugu News