మిగిలింది రెండు రెండు మ్యాచ్‌లే.. సీఎస్కే, ఆర్సీబీ, ఢిల్లీ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే సమీకరణాలు ఇవే
- 60 మ్యాచ్‌లు ముగిసినా ఫ్లే ఆఫ్స్‌పై ఎడతెగని ఉత్కంఠ
- మిగిలివున్న మూడు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఆరు జట్లు పోటీ
- ఆసక్తికరంగా మారిన సమీకరణాలు
ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ముగిశాయి. ఇంకా కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ 10 జట్లలో కేవలం కోల్‌కతా నైట్ రైజర్స్ మాత్రమే ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మిగిలివున్న మూడు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఏకంగా 7 జట్లు పోటీ పడుతున్నాయి. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ సమీకరణాలు మరింత గందరగోళంగా మారాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరబోయే జట్లు ఏవీ అనేది ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ చేరేందుకు మెరుగైన అవకాశాలు ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైపై గుజరాత్ విజయం సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు సమీకరణాలు ఏవిధంగా ఉన్నాయో పరిశీలిద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ (+0.491)తో 4వ స్థానంలో ఉంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్కే తలపడనుంది. చివరి మ్యాచ్‌లో ఆర్సీబీతో చెన్నై తలపడనుంది. చెన్నై మిగిలివున్న తన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, లక్నో జట్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడంతో అర్హత సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో మాత్రమే చెన్నై గెలిస్తే.. ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో గెలిచే జట్టు తన తదుపరి మ్యాచ్‌లో ఓటమి కోసం రుతురాజ్ గైక్వాడ్ సేన ఎదురుచూడాల్సి ఉంటుంది. ఒకవేళ మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాలు..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుతం 12 పాయింట్లు, -0.316 నెట్ రన్ రేట్‌తో 5వ స్థానంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలుంటాయి. ఢిల్లీతో పాటు చెన్నై కూడా మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 16 పాయింట్లతో నిలిస్తే నెట్ రన్ రేట్ కీలకమవనుంది. ఒకవేళ మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఒకదాంట్లో ఓడిపోతే ఆ జట్టు వద్ద 14 పాయింట్లే ఉంటాయి. అప్పుడు చెన్నై తన రెండు మ్యాచ్‌ల్లో, లక్నో ఒక మ్యాచ్‌లో ఓడిపోతే ఢిల్లీకి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓడిపోతే సీఎస్కే ఫలితంతో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవకాశాలు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆ జట్టు 7వ స్థానంలో నిలిచింది. మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో మొత్తం 14 పాయింట్లు ఉంటాయి. అయినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తొలుత మిగిలివున్న మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఇతర జట్ల ఫలితాలు కూడా ఆర్సీబీకి అనుకూలంగా ఉండాలి. రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల చేతిలో లక్నో జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్లే ఆఫ్స్‌కు పోటీపడే ఆరు జట్లు 14 పాయింట్లతో సమంగా ఉంటాయి. ఈ సమీకరణంలో మెరుగైన రన్ రేట్ ఉంటే ఆర్సీబీ అర్హత సాధించగలుగుతుంది.