బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై తెలంగాణలో మరో కేసు
- ఈ నెల 8న లక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న పోలీసులు
- ఇప్పటికే షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- తాజాగా సైదాబాద్ పీఎస్‌లో కేసు నమోదు
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్ కౌర్ రాణాపై మరో కేసు నమోదయింది. మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఎంపీ ఒవైసీ సోదరులపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో హైదరాబాద్‌లోని యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇంఛార్జ్ రాకేశ్ ఫిర్యాదు మేరకు తాజాగా సైదాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ నెల 8న లక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. 2012లో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నవనీత్ గుర్తు చేశారు. 'వారికి 15 నిమిషాలేమో.. పోలీసులు తప్పుకుంటే అదే తమకు 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు' అని ఆమె హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా... ఇప్పుడు సైదాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.