సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 90 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు: సీపీ అవినాశ్ మహంతి

  • ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు ఉన్నాయన్న సీపీ
  • 8500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • స్థానిక పోలీసులతో పాటు క్విక్ రియాక్షన్ టీమ్, కేంద్రబలగాలను దింపినట్లు వెల్లడి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు ఉన్నాయని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 8500 మంది పోలీసులతో సైబరాబాద్ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక పోలీసులతో పాటు క్విక్ రియాక్షన్ టీమ్ ఉందని తెలిపారు. కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 3396 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు వెల్లడించారు. 90 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు.

289 రూట్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. పారామిలిటరీ, సీఏఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఎల్లుండి సాయంత్రం వరకు వైన్ దుకాణాలు బంద్ ఉంటాయని వెల్లడించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలు ఉన్నాయన్నారు. సైబరాబాద్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దాని కంటే తక్కువ కేంద్ర బలగాలు వచ్చినట్లు చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ బలగాలను మోహరించినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.


More Telugu News