13న ఉదయం 7 గంటల నుంచి తెలంగాణలో పోలింగ్: సీఈవో వికాస్ రాజ్

  • 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6  వరకు పోలింగ్ ఉంటుందని వెల్లడి
  • 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందన్న సీఈవో
  • తెలంగాణవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడి
ఈ నెల 13వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుందని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 119 నియోజకవర్గాలకు గాను 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6  వరకు ఉంటుందని తెలపారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13వ తేదీనే తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్: డీజీపీ రవి గుప్తా

ఎల్లుండి పోలింగ్ నేపథ్యంలో ఈరోజు ప్రచారం ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. పోలింగ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తమిళనాడు నుంచి మూడు స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు వచ్చాయన్నారు.


More Telugu News