ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

  • ఏపీలో ఎల్లుండి మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
  • హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా తరలి వస్తున్న ఓటర్లు
  • వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు
ఏపీలో ఎల్లుండి (మే 13) సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. మే 13వ తేదీన పోలింగ్ కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.  ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని చంద్రబాబు తన లేఖలో  పేర్కొన్నారు. 

లేఖలోని అంశాలు 

•    మే 13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు. 
•    ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు. 
•    ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. 
•    ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్ లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది.  
•    అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారు. 
•    ఈ రెండు మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి.  
•    రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది... అని చంద్రబాబు తన లేఖలో  వివరించారు.


More Telugu News