రాజమండ్రి ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ కు ఘనస్వాగతం.. పిఠాపురంకు పయనం

  • తల్లి సురేఖతో కలిసి రాజమండ్రికి చేరుకున్న రామ్ చరణ్
  • బాబాయ్ కోసం పిఠాపురం వెళ్తున్న చరణ్
  • కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయనున్న చరణ్, సురేఖ
ఇప్పుడు అందరి దృష్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఉంది. పవన్ కు మద్దతుగా సినీ నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తన బాబాయ్ కోసం రామ్ చరణ్ కాసేపట్లో పిఠాపురంకు చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకున్న చరణ్ కు విమానాశ్రయం వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఎయిర్ పోర్టు ఎగ్జిట్ గేట్ వద్ద సందడి నెలకొంది. చరణ్ తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ కూడా ఉన్నారు. 

అక్కడి నుంచి చరణ్ పిఠాపురంకు బయల్దేరారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారిని చరణ్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పిఠాపురం పట్టణంలో ఆయన పర్యటిస్తారు. వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.


More Telugu News