ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడానికి మనకు ఇదే చివరి అవకాశం: శివాజీ
- రాష్ట్రాన్ని జగన్ వెనుకబడేటట్టు చేశారన్న శివాజీ
- ఏ రంగం చూసుకున్నా గుండు సున్నానే అని ఎద్దేవా
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమని వ్యాఖ్య
వైసీపీ పాలనలో అన్ని రకాలుగా నాశనమైన ఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశమని సినీ హీరో శివాజీ అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారని... రాష్ట్రం వెనుకబడేట్లు చేసింది మాత్రం సీఎం జగనేనని విమర్శించారు. ప్రజలకు ఉపాధి కల్పించడం మానేసి... ఏడాదికి రూ. 10 వేలు ఇస్తానంటే ఆ కుటుంబ పోషణ ఎలాగని ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిందే ఉపాధి అని, డబ్బులు కాదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కానీ, పెద్ద కంపెనీలు కానీ ఎంత మందికి ఉపాధి కల్పిస్తాయని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని శివాజీ అన్నారు. ఒక పెద్ద కంపెనీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 60 వేల మంది ఉపాధి పొందుతారని చెప్పారు. ఏపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. ప్రజలంతా రూ. 10 వేల కోసం ఆశ పడకుండా... బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందని విమర్శించారు. ఏ రంగం చూసుకున్నా గుండు సున్నానే అని ఎద్దేవా చేశారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో చాలా ప్రమాదకరమని శివాజీ చెప్పారు. పాస్ పుస్తకాలపై సీఎం ఫొటోలు ఉండటం దారుణమని అన్నారు. పాస్ బుక్ బ్యాంక్ తనఖాకు పనికి రాదంట అని చెప్పారు. 'భూముల వివరాలు తెలుసుకోవడానికే' అని పాస్ పుస్తకంలో రాశారని తెలిపారు. మా పంట భూముల సర్వే రాళ్లపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు.