'సలార్' శ్రియారెడ్డి పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ .. ఓటీటీలో!

  • వెబ్ సిరీస్ ల వైపు శ్రియా రెడ్డి 
  • రీసెంటుగా పూర్తిచేసిన 'తలమై సేయలగం' 
  • 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
  • ఈ నెల 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్

శ్రియా రెడ్డి .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలో ఆమె ఎంత గొప్పగా మెప్పిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ మధ్య  'సలార్'లో ఆమె చేసిన పాత్రను .. ఆ పాత్రలో ఆమె జీవించిన తీరును ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అలాంటి శ్రియా రెడ్డి ప్రధానమైన పాత్రగా ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఆ సిరీస్ పేరే 'తలమై సేయలగం'. 

రాడాన్ మీడియా బ్యానర్ పై రాధిక నిర్మించిన ఈ సిరీస్ కి వసంత్ బాలన్ దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను తమిళంతో పాటు తెలుగులోను అందించనున్నారు. ఇతర ప్రధానమైన పాత్రలలో ఆదిత్య మీనన్ .. భరత్ .. కన్నడ కిశోర్ .. రమ్య నంబీసన్ కనిపించనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సిరీస్ ను జీ 5 లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

 తమిళనాడులోని స్వార్థ రాజకీయాలు .. అధికార దాహం ఒక వైపు, మరో వైపున వరుసగా జరుగుతున్న హత్యలు .. ఈ నేపథ్యం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. పగలు .. ప్రతీకారాలు .. కుట్రలు .. కుతంత్రాలు ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.



More Telugu News