లక్నోలో నడిరోడ్డుపై తుపాకీతో ఓ యువతి డ్యాన్స్!
- సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేందుకు ఓ ఇన్ స్టాగ్రామ్ స్టార్ పిచ్చిపని
- భోజ్ పురి పాటకు చిందేసిన సిమ్రన్ యాదవ్
- మండిపడుతున్న నెటిజన్లు.. చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించేందుకు కొందరు నెటిజన్లు రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో నిలిచేందుకు, ఫాలోవర్లను పెంచుకొనేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సిమ్రన్ యాదవ్ అనే ఇన్ స్టాగ్రామ్ స్టార్, యూట్యూబర్ ఇలాగే చేసింది. పట్టపగలే నడి రోడ్డుపై తుపాకీ చేతిలో పట్టుకొని ఓ భోజ్ పురి పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసింది. లక్నో హైవేపై ఈ డ్యాన్స్ వీడియోను షూట్ చేయించుకుంది. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
ఈ వీడియోను చూసిన కల్యాణ్జీ చౌదరి అనే అడ్వొకేట్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆమె చర్యను తప్పుబడుతూ కామెంట్ పోస్ట్ చేశారు. ‘ఇన్ స్టాగ్రామ్ స్టార్ సిమ్రన్ యాదవ్ బహిరంగంగానే చట్టాన్ని అతిక్రమిస్తోంది. చేతిలో తుపాకీ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ సమాజంలో తన సామాజిక వర్గ బలాన్ని ప్రదర్శిస్తోంది. కానీ దీన్ని చూశాక కూడా అధికారులు కిమ్మనకుండా ఉన్నారు’ అంటూ ఆయన విమర్శించారు. ఆ వీడియోను తన కామెంట్ కు జత చేశారు. దీనిపై లక్నో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా సిమ్రన్ యాదవ్ తీరుపై మండిపడుతున్నారు. ఆమెపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిమ్రన్ యాదవ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఆమె యూట్యూబ్ చానల్ ను 18 లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.