మళ్లీ అదే సీన్ రీపిట్.. ఈసారి ధోనీ వంతు.. వైరల్ వీడియో!
- అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జీటీ, సీఎస్‌కే మ్యాచ్
- చెన్నై ఇన్నింగ్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించిన అభిమాని
- ధోనీ వద్దకు పరిగెత్తుకు వచ్చి కాళ్లు మొక్కిన వైనం
- ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ, రోహిత్ శర్మకు ఇప్పటికే ఇలాంటి అనుభవం
సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి తమ అభిమాన క్రికెటర్లను కలుసుకోవడం ఫ్యాన్స్‌కు పరిపాటిగా మారింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ వంతు వచ్చింది. నిన్నటి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని గ్రౌండ్ సిబ్బందిని దాటుకుని వచ్చి ధోనీ కాళ్లు మొక్కాడు. అంతలోనే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో చివరల్లో క్రీజులోకి వచ్చిన ధోనీ బ్యాట్ ఝుళిపించాడు. 11 బంతుల్లో 26 (నాటౌట్) పరుగులు బాదాడు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు కొట్టి ప్రేక్షకులను అలరించాడు ఎంఎస్‌డీ. అలాగే ఆట చివరి ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో చాలా రోజుల తర్వాత తన సిగ్నేచర్ హెలికాప్టర్ షాట్ ఆడి ఓ సిక్స్ బాదడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పరాజయం పొందడం సీఎస్‌కేను దెబ్బతీసింది. మరోవైపు ఈ విజయంతో టైటాన్స్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
కాగా, చాలా రోజుల తర్వాత ధోనీకి బౌలింగ్ చేయడం పట్ల జీటీ ఆటగాడు రషీద్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. "నేను అతనికి (ధోని) బౌలింగ్ చేశాను. ఎంఎస్‌డీ క్రీజులోకి వచ్చినప్పుడు అది భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. అతనితో ఆడటం మాకు మంచి ఊపును ఇస్తుంది" అని రషీద్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.