ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రులు ఇవే
- అత్యుత్తమ ఆసుపత్రిగా అమెరికా రోచస్టర్‌లోని మాయో క్లినిక్
- టాప్-10లో తొలి నాలుగు ఆసుపత్రులు అమెరికావే
- ఇజ్రాయెల్ ఆసుపత్రి షేబా మెడికల్ సెంటర్‌కూ చోటు
- వివరాలు వెల్లడించిన స్టాటిస్టా-న్యూస్‌వీక్
ఈ ఏడాది ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రిగా అమెరికా రోచస్టర్‌లోని మాయో క్లినిక్ రికార్డులకెక్కింది. అంతేకాదు, అత్యుత్తమమైన ఐదు ఆసుపత్రుల్లో నాలుగు అమెరికా ఆసుపత్రులే కావడం విశేషం. వీటిలో క్లీవ్‌లాండ్‌లోని క్లీవ్‌లాండ్ క్లినిక్, టొరొంటోలోని టొరొంటో జనరల్, బాల్టిమోర్‌లోని జాన్ హాప్‌కిన్స్ ఆసుపత్రి, బోస్టన్‌లోని మేరీల్యాండ్, మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. టొరొంటో ఆసుపత్రి ఈసారి రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం.
యూరప్‌కు చెందిన పలు ఆసుపత్రులు కూడా ఈసారి ఈ జాబితాకెక్కాయి. వీటిలో బెర్లిన్‌లోని చారిటే యూనివర్సిటీ, స్వీడన్‌లోని కరోలిన్‌స్కా యూనివర్సిటెట్స్‌జెఖుసెట్, పారిస్‌లోని హోపిటల్ యూనివర్సిటీ పిటీ సల్పెట్రీర్ వంటివి చోటు దక్కించుకున్నాయి. ఇక టాప్-10 జాబితాలో ఇజ్రాయెల్‌లోని షేబా మెడికల్ సెంటర్, స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్ జ్యురిచ్ ఉన్నాయి. డేటా సేకరణ సంస్థ స్టాటిస్టా, న్యూస్ మేగజైన్ న్యూస్‌వీక్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 30 దేశాల్లోని 85 వేల మంది వైద్య నిపుణుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించాయి.