ప్రజ్వల్ రేవణ్ణ గురించి హెచ్చరించిన బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు

  • ఏప్రిల్ 1న బీజేపీ నేత దేవరాజెపై లైంగిక వేధింపుల కేసు నమోదు
  • ఆస్తి అమ్మేందుకు సాయం పేరిట వేధించాడంటూ మహిళ ఫిర్యాదు
  • ప్రజ్వల్ గురించి గతేడాది బీజేపీ అధిష్ఠానాన్ని తొలిసారిగా హెచ్చరించిన దేవరాజె గౌడ
  • అతడి లైంగిక వేధింపుల వీడియోలు అనేకం ఉన్నాయంటూ లేఖ రాసిన వైనం
కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బాగోతాల గురించి పార్టీ అధిష్ఠానాన్ని తొలిసారిగా హెచ్చరించిన బీజేపీ నేత జి.దేవరాజె గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏప్రిల్ 1నే ఈ కేసు నమోదైనా ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి అమ్మేందుకు సాయం చేస్తానంటూ దేవరాజె గౌడ తనపై లైంగిక వేధింపులకు దిగాడని 36 ఏళ్ల మహిళ ఒకరు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ పరిణామంపై దేవరాజె గౌడ ఇంకా స్పందించాల్సి ఉంది. 

హసన్‌ జిల్లాకు చెందిన దేవరాజె గౌడ లాయర్. లోక్ సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతివ్వొద్దంటూ బీజేపీని గతేడాది ఆయన హెచ్చరించారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల వీడియోలు అనేకం ఉన్నాయని, అవి బయటకు వస్తే పార్టీకి చేటు కలుగుతుందని హెచ్చరించారు. ప్రజ్వల్ వీడియోలు లీకవడానికి కారణం కాంగ్రెస్ అని కూడా ఆయన ఆరోపించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరాజె.. ప్రజ్వల్ తండ్రి హెడీ రేవణ్ణపై పోటీ చేసి ఓడిపోయారు.


More Telugu News