ఎన్టీ రామారావుకు 'భారతరత్న' వస్తే బాగుంటుంది: చిరంజీవి

  • నిన్న ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి
  • నేడు హైదరాబాద్ తిరిగిరాక
  • ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన మెగాస్టార్
ఎంత ఒదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతారు. ఈ సూత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి అక్షరాలా పాటిస్తారు. నిన్న ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ప్రతిష్ఠాత్మ పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవిని మీడియా పలకరించింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అంటూ వినమ్రంగా స్పందించారు. 

ఇక నందమూరి ఎన్టీ రామారావుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'భారతరత్న' వస్తే సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు.


More Telugu News