ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్
- మొబైల్‌తో రీఛార్జ్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్
- మూడు ప్లాన్ల కింద అందించిన భారతి ఎయిర్‌టెల్
- పోస్ట్ పెయిడ్ ప్లాన్లు రూ.1199, రూ.1499, ప్రీపెయిడ్ ప్లాన్లు ర.1499 కింద సబ్‌స్క్రిప్షన్ ఛాన్స్
ఇండియాలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఉన్న భారతి ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్. భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ‘నెట్‌ఫ్లిక్స్’ సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ రీచార్జ్ ప్లాన్ల కింద ఎయిర్‌టెల్ అందించింది. ఒక ప్రీపెయిడ్ ప్లాన్, రెండు పోస్ట్‌పెయిడ్ మొత్తం మూడు ప్లాన్ల కింద నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేసింది.
ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 1,199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇక రూ.1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కూడా ఈ మూడు ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా అందిస్తోంది. రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 100 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను ఆఫర్ చేస్తోంది. అదనపు ప్రయోజనాలుగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అపరిమిత 5జీ డేటా, అపోలో 24|7 సర్కిల్ సేవలు, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌లను పొందొచ్చని ఎయిర్‌టెల్ వెల్లడించింది. రూ. 1,199, రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో కూడా 5జీ అపరిమిత డేటా లభిస్తుందని భారతి ఎయిర్‌టెల్ వివరించింది.
నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్స్ భారతీయ యూజర్లకు కాస్త ప్రియమైనదని చెప్పాలి. ఎందుకంటే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పోల్చితే నెట్‌ప్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. పైగా ఎలాంటి వార్షిక ఆఫర్లు ఉండవు. నెలవారీగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొబైల్ రీఛార్జుల ద్వారా లభించే ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ యూజర్లకు చక్కటి వ్యాల్యూను జత చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా భారత్‌లో భారతి ఎయిర్‌టెల్ 380 మిలియన్ల మంది యూజర్లను కలిగివుంది.