నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- ఎన్నికల ప్రచారానికి ప్రధాని సుడిగాలి పర్యటన
- మహబూబ్ నగర్ ఎన్నికల సభలో పాల్గొననున్న ప్రధాని
- సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోనున్న మోదీ
- మరోవైపు తెలుగురాష్ట్రాల్లో ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తెలంగాణలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని నందూర్బార్లో ఉదయం 11:30గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 3:15గంటలకు మహబూబ్ నగర్ లోని ఎన్నికల సభకు హాజరవుతారు. అక్కడ్నుంచి తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఒడిశాకు వెళ్తారు. భువనేశ్వర్ లో రాత్రి 8:30 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు.
ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ కు చేరుకుని హోటల్ తాజ్ కృష్ణలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భువనగిరిలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడునుంచి బయల్దేరి ఏపీలోని విజయవాడలో 6.45 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.