తన మేనత్తని రేవంత్ రెడ్డి దూషిస్తుంటే ఎమ్మెల్యే నవ్వులు చిందించారు: చిట్టెం పర్నికర్ రెడ్డిపై డీకే అరుణ ఆగ్రహం
- గత ఎన్నికల్లో మేనత్త ఆశీస్సులు ఉన్నాయని తన పేరుతో గ్రామగ్రామంలో చిట్టెం పర్నికర్ రెడ్డి తిరిగారన్న అరుణ
- ఇప్పుడు మాత్రం తనను దూషిస్తుంటే మౌనంగా ఉన్నారని ఆగ్రహం
- రేవంత్ రెడ్డి తనను అణగదొక్కాలని చూస్తున్నారన్న డీకే అరుణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిలు కనీసం తాను మహిళను అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దూషించారని, వీరి మాటలను నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికర్ రెడ్డి ఖండించలేదని... పైగా నవ్వుతూ కనిపించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్నికర్ రెడ్డి తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు మేనత్త ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొని గ్రామగ్రామానికి తిరిగారని, వెంట మేనమామను తీసుకెళ్లారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కించపరిచిన వారితో కలిసి ఊరేగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తండ్రిని దివంగత జైపాల్ రెడ్డి అణగదొక్కారని... ఇప్పుడు ఆయన అల్లుడు రేవంత్ రెడ్డి తనను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. నర్సిరెడ్డి వారసుల గౌరవాన్ని కించపరుస్తూ అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. అలాంటి వారిని పొలిమేర దాటించి... పరుగెత్తించడం ఖాయమని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారాన్ని చలాయిస్తున్న వారంతా చరిత్ర లేని వ్యక్తులే అన్నారు. ఆడబిడ్డను కించపరిచిన నాయకులను లోక్ సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో తెలంగాణ అప్పులపాలైందని... కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు.