'ది కేరళ స్టోరీ' టీమ్ నుంచి వస్తున్న 'బస్తర్' .. జీ 5లో!
- మార్చిలో థియేటర్లకు వచ్చిన 'బస్తర్'
- నక్సలిజం నేపథ్యంలో ఆగే కథ
- ప్రధానమైన పాత్రను పోషించిన అదా శర్మ
- ఈ నెల 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
వెండితెరకి నక్సల్ స్టోరీలు కొత్తకాదు. అయితే ఈ సారి సమస్యను కొత్త కోణంలో చూపించే ఒక ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నం జరిగిన సినిమానే 'బస్తర్ - ది నక్సల్ స్టోరీ'. ఎవరు ఎందుకు నక్సలైట్లుగా మారతారు. వారిలో ఉన్నది ఆవేశమా? ఆశయమా?. హింస అనే లక్షణాన్ని కలిగిన సిద్ధాంతమా? అనే కోణంలో రూపొందించబడిన ఈ సినిమా, మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది.
గతంలో సంచలనాత్మకమైన సినిమా 'ది కేరళ స్టోరీ'ని తెరకెక్కించిన సుదీప్తో సేన్ - విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను రూపొందించారు. ఐపీఎస్ ఆఫీసర్ నీరజా మాధవన్ పాత్రలో అదా శర్మ కనిపించనుంది. ఒక వైపున రాజకీయ పరమైన ఒత్తిళ్లను తట్టుకుంటూనే, నక్సల్స్ చర్యలను నియంత్రించే పాత్రలో ఆమె కనిపించనుంది. నక్సల్స్ తమ ఉనికిని చాటుకోవడానికి మళ్లీ రంగంలోకి దిగుతారు.
నక్సల్స్ చర్యల కారణంగా అమాయకులైన ప్రజలు ఆపదలో పడుతూ ఉంటారు. డ్యూటీలో ఉన్న పోలీస్ వారు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నక్సల్స్ ఆగడాలను అరికట్టే బాధ్యతను నీరజా మాధవన్ కి ప్రభుత్వం అప్పగిస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమాను జీ 5 వారు స్ట్రీమింగ్ చేయనున్నారు.