పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్.. వీడియో వైరల్!
- న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల వేడుక
- పద్మశ్రీ అందుకున్న ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల యోగా టీచర్ చార్లెట్ చోపిన్
- వందేళ్లు దాటినప్పటికీ యోగా చేయడం వల్లే ఆమె ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నారంటున్న నెటిజన్లు
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వందేళ్లు దాటిన విదేశీయురాలు భారతతీయ సంప్రదాయ చీరకట్టులో వచ్చి అందిరి దృష్టినీ ఆకర్షించారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల యోగా టీచర్ చార్లెట్ చోపిన్ ఈ వయసులోనూ స్వయంగా నడుచుకుంటూ వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. వందేళ్లు దాటినప్పటికీ యోగా చేయడం వల్ల ఆమె ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అవార్డు అందుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ ఏడాది జనవరి 25న 132 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. సినీ రంగంలో కొణిదెల శివశంకర వరప్రసాద్(చిరంజీవి) చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన పాల్గొన్నారు.