భైంసాలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా... ఉల్లిగడ్డలు, టమాటాలు విసిరారు
- భైంసాలోని పాత చెక్ పోస్ట్ కార్యాలయం సర్కిల్ వద్ద కేటీఆర్ కార్నర్ మీటింగ్
- కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన హనుమాన్ దీక్షాపరులు
- కేటీఆర్ వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచార సభలో గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహంలో నుంచి కొందరు ఉల్లిగడ్డలు, టమాటాలు విసిరారు. ఇవి ప్రచార వాహనం సమీపంలో పడ్డాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా జరిగింది.
పట్టణంలోని పాత చెక్ పోస్ట్ కార్యాలయం సర్కిల్ వద్ద కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో కొంతమంది కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారంతా హనుమాన్ దీక్షలో ఉన్నారు. 'హిందువులు ఆదర్శంగా భావించే శ్రీరాముడి జోలికి వస్తే ఊరుకునేది లేదు బిడ్డా... ఖబడ్దార్ కేటీఆర్' అని ప్లకార్డులలో హెచ్చరించారు.
అంతేకాదు, వారు కేటీఆర్ వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత ఇంకొంతమంది ప్రచార వాహనం వైపు టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.