ఇక్కడుండే వైసీపీ ఇన్చార్జి పనికిమాలినవాడు... ఇప్పుడే ఇలా ఉన్నాడు... గెలిస్తేనా?: చంద్రబాబు
- విశాఖలో చంద్రబాబు ప్రజాగళం సభ
- ఒక మంచి ప్రజానీకం ఉండే ప్రాంతం విశాఖ అని చంద్రబాబు కితాబు
- 2019లో ఇక్కడి ప్రజలు జగన్ మాయలో పడలేదని వెల్లడి
- అతడి గురించి ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయానేమో! అని చంద్రబాబు విచారం
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎప్పుడూ తన గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం అని పేర్కొన్నారు. తాను మెచ్చిన ప్రాంతం, తనను అభిమానించే ప్రాంతం, ఒక మంచి ప్రజానీకం ఉండే ప్రాంతం విశాఖపట్నం అని అభివర్ణించారు.
2019లో సైకో జగన్ ఊరూరా తిరిగాడని, అందరూ మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారని అన్నారు. కానీ విశాఖపట్నం ప్రజలు మాత్రం విజ్ఞతతో ఆలోచించారని, నాలుగు సీట్లలోనూ టీడీపీనే గెలిపించారని అంటూ.. 'అదీ... విశాఖ ప్రజల ముందు చూపు' అని పేర్కొన్నారు.
"నేను అప్పుడే చెప్పాను. జగన్ వస్తే రాజధాని బంద్... అమరావతి ఆగిపోతుంది, పోలవరం నిలిచిపోతుంది, చాలా కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారు, ఊరికొక రౌడీ, బజారుకొక కబ్జాదారుడు తయారవుతాడని నమస్కరించి చెప్పాను. కానీ నేను చెప్పింది విన్నది ఒక్క విశాఖపట్నం వాసులే. మిగిలినవాళ్లు వినలేదు. నేను కూడా ప్రజలకు గట్టిగా చెప్పలేకపోయానేమో... నేను ప్రజలను చైతన్యవంతులను చేయలేకపోయానేమో!
కానీ ఇతను వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! ఇతను ఎవరినైనా మినహాయించాడా? ఈ ఐదేళ్లలో ఒక్క కుటుంబమైనా బాగుపడిందా? ఏ వ్యక్తికైనా లాభం జరిగిందా? పరిపాలన అంటే... ప్రజల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ భవితకు భరోసా ఇవ్వాలి... ఇచ్చాడా?
తొమ్మిదిసార్లు కరెంటు చార్జీలు పెంచాడు. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కసారైనా కరెంటు చార్జీలు పెంచామా? మేం వినూత్నంగా ముందుకెళ్లాం. సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉంటే, మూడు నెలల్లో కరెంటు కొరత అధిగమించి నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత టీడీపీది. అదే సమయంలో మిగులు కరెంటు కూడా సాధించాం.
మళ్లీ నేను అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచనని 2019లో చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. ఎప్పుడైనా సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరంలేదు. ఒకప్పుడు ఒక యూనిట్ కరెంటు ఉత్పత్తికి రూ.7 రూపాయలు ఖర్చయితే, ఇవాళ రూ.2.50కే సోలార్ విద్యుత్ వస్తోంది. అది కూడా చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి ప్రజల మీద భారం వేశాడు.
విశాఖపట్నంలో కొందరు మందుబాబులు ఉన్నారు. రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఒక పెగ్ వేసి, లేకపోతే ఒక క్వార్టర్ వేసి పడుకోవాలనుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు... ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్నాడు.
ఒకప్పుడు మంచి బ్రాండ్లు ఉండేవి. మీ ఆరోగ్యానికి హానికరం కాని బ్రాండ్లు అవి! ఎప్పుడైనా మద్యం హానికరమే. ఎక్కువ తాగితే శరీరం మొత్తం దెబ్బతింటుంది. రూ.60 చేసే క్వార్టర్ బాటిల్ ను ఇప్పుడు రూ.200 చేశాడు. మద్యంలో కలిపేది మొలాసిస్సే. మరి మిగతా రూ.140 ఎక్కడికి పోతున్నాయి.
ఇవాళ ప్రజలు విషపూరితమైన మద్యాన్ని తాగున్నారు. అది తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. రాష్ట్రంలో 31 వేల మంది చనిపోయారు. మద్యం ధర పెరగడంతో చాలామంది గంజాయికి అలవాటుపడ్డారు. ఒక ఐటీ రాజధానిగా, ఒక నాలెడ్జ్ ఎకానమీగా, టూరిజం అభివృద్ధి చేయాలని ఎంతో శ్రమించాను. ఇక్కడ హైటెక్ సిటీకి సమానంగా మిలీనియం టవర్ ఏర్పాటు చేశాం. డేటా సెంటర్ తీసుకువచ్చాం... అది వచ్చుంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవి.
అన్నింటినీ తరిమేశారు. లులూ వచ్చుంటే విశాఖలో టూరిజం ఎంతో అభివృద్ధి చెందేది. ఇక్కడికి డ్రగ్స్ వస్తున్నాయి. నేను అన్ని రకాల పరిస్థితులను హ్యాండిల్ చేయగలను. ఒక్కసారి మన పిల్లలు గంజాయికి అలవాటు పడితే వాళ్లను కాపాడుకోవడం చాలా కష్టం. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది.
రాష్ట్రంలో ధరలన్నీ పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఆస్తి పన్ను పెంచేశారు, చెత్త మీద కూడా పన్నేశారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ వేశారు. ఇన్ని పన్నులు పెంచేసి నేను బటన్ నొక్కుతా, బటన్ నొక్కుతా అంటాడు. బటన్ నొక్కి నువ్వు ఇచ్చింది ఎంత, దోచింది ఎంత? చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేసే రకం ఈ జగన్ మోహన్ రెడ్డి.
మూడు పార్టీల కలయిక మా కోసం కాదు... ప్రజల కోసం. పతనమైపోయిన రాష్ట్రాన్ని పునరుద్ధరించాలన్న ఏకైక లక్ష్యంతో కలిశాం. ఒకసారి పవన్ కల్యాణ్ విశాఖ వస్తే ఆయనను ఎక్కడా తిరగకుండా చేశారు. విశాఖలోనే ఉండకూడదని నగర బహిష్కరణ చేశారు. విశాఖ వీళ్ల అబ్బ సొత్తు అనుకుంటున్నారు.
ఇక్కడుండే వైసీపీ ఇన్చార్జి పనికిమాలినవాడు. నేనొస్తే నా మీద దాడి చేయించాడు. పవన్ కల్యాణ్ వస్తే దాడి చేయించాడు. ఇన్చార్జిగా ఉంటేనే ఇంత రౌడీయిజం చేస్తే, రేపు అతడు ఎమ్మెల్యే అయితే హద్దులుంటాయా? అలాంటి రౌడీ మీకు కావాలా? మీరు క్షమిస్తారా? నేను మాత్రం రౌడీలను వదిలిపెట్టను... తోక కట్ చేస్తా... ఖబడ్దార్!
ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి. ఒక రౌడీపై పోరాడుతున్నాడు... ఆయనకు విశాఖ ప్రజల అండ కావాలి. మే 13 వచ్చేస్తోంది. ఎండ ఉందని ఇంట్లో పడుకుంటే కొంపలు కూలిపోతాయి. పవిత్రమైన కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలి. మంచి వ్యక్తి గెలిస్తే భవిష్యత్ ఉంటుంది... చెడు వ్యక్తి వస్తే...?
విశాఖ ప్రజలు చాలా తెలివైనవాళ్లు. 2014లో జగన్ తల్లి విశాఖలో పోటీ చేయడానికి వచ్చింది. ఇక్కడి ప్రజలు ఆమెను ఓడించి పంపారు. ఇక్కడ ఎంపీ స్థానం నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. భరత్ విద్యావంతుడు, మంచి వ్యక్తి... అభివృద్ధి కావాలనుకుంటే ఇలాంటి వ్యక్తులను గెలిపించుకోవాలి.
జైల్లో నన్ను లేపయడానికి కూడా ప్రయత్నించారు... ఎక్కడా నేను భయపడలేదు. ఒకవేళ భగవంతుడు రాసిపెడితే ఏదైనా జరుగుతుంది... నేను తప్పుచేయలేదు... అనే ధైర్యంతో ముందుకెళ్లాను. జైల్లో ఉంటే డ్రోన్లు పంపించారు, ఇంకేవేవో చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా వేధించారు. విశాఖ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.