అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది: రేవంత్ రెడ్డి

  • 18వ లోక్ సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య అన్న రేవంత్ రెడ్డి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లూ ప్రమాదంలో పడ్డాయన్న ముఖ్యమంత్రి
  • రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ నేతలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారన్న సీఎం
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్‌లో జరిగిన జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ... 18వ లోక్ సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఈ రోజు బయలుదేరారని విమర్శించారు.

ఇందిరాగాంధీ తన చివరి శ్వాస వరకు తెలంగాణ ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీ నేతలపై మన యువనేత రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచి రిజర్వేషన్లు కాపాడుకోవాల్సి ఉందన్నారు.


More Telugu News