శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- శామ్ పిట్రోడా రాజీనామా చేయడం కాదని... కాంగ్రెస్ ఆయనను బహిష్కరించాలన్న లక్ష్మణ్
- కాంగ్రెస్ పార్టీ విధానపరమైన ఆలోచనలను శామ్ పిట్రోడా బయటపెట్టారని వ్యాఖ్య
- కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఈశాన్య భారతీయులు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల్లా, దక్షిణాదివారు ఆఫ్రికన్లలా, ఉత్తరాదివారు వైట్స్‌లా కనిపిస్తారన్న కాంగ్రెస్ పార్టీ మాజీ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పిట్రోడా రాజీనామా చేయడం కాదని... కాంగ్రెస్ ఆయనను బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానపరమైన ఆలోచనలను శామ్ పిట్రోడా బయటపెట్టారన్నారు.
పిట్రోడాతో పాటు అధిర్ రంజన్ వ్యాఖ్యలను వ్యక్తిగతం అని కొట్టిపారేయలేమన్నారు. వారి వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.