ఎలుగుబంట్లు ఇలా ఎక్కేస్తాయా.. ఐఎఫ్​ఎస్​ ఆఫీసర్​ షేర్​ చేసిన వైరల్​ వీడియో ఇదిగో!

  • హిమాలయన్ బ్లాక్ బేర్ ల వీడియో షేర్ చేసిన పర్వీన్ కాస్వాన్
  • మనుషుల్లా సింపుల్ గా చెట్టు ఎక్కుతూ, దిగిన ఎలుగుబంట్లు
  • వీడియో వైరల్.. ఇలాగైతే అడవుల్లోకి వెళ్తే ఎలాగంటూ కామెంట్లు
గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, అడవుల్లోకి వెళ్లినా.. అప్పుడప్పుడు ఎలుగు బంట్లు కనిపించడం మామూలే. సాధారణంగా ఎలుగు బంట్లుగానీ, ఇతర అడవి జంతువులుగానీ ఎదురైతే.. ఏదైనా పెద్ద చెట్టు చూసుకుని ఎక్కేయాలని చెబుతూ ఉంటారు. కానీ అలా చెట్టు ఎక్కినా పెద్దగా లాభమేం లేదంటూ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తాజాగా ఓ వీడియో పోస్టు చేశారు.

మనుషుల్లా ఎక్కేస్తూ.. 
ఆ వీడియోలో ఒక పెద్ద ఎలుగు బంటి, దానిపిల్ల రెండూ ఓ చెట్టు పై నుంచి దిగుతూ కనిపిస్తున్నాయి. కాసేపటికే మరో చెట్టు ఎక్కడం కూడా మొదలుపెట్టాయి. ఉత్తరప్రదేశ్ లోని హిమాలయ పర్వతాల సమీపంలోని అడవుల్లో తీసిన ఈ వీడియోను పర్వీన్ కాస్వాన్ తాజాగా పోస్ట్ చేశారు. 

అవి సరికాదని అర్థమైందంటూ..
‘‘చిన్నప్పుడు ఎలుగుబంట్లు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఎత్తయిన చెట్లు ఎక్కాలని కథల్లో చెప్పేవారు. అలా కాపాడుకున్న చిన్నారులు అంటూ పాఠాలు కూడా ఉండేవి. అది  సరికాదని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. హిమాలయన్ బ్లాక్ బేర్, దాని పిల్ల రెండూ చెట్లు ఎలా ఎక్కుతున్నాయో చూడండి. ఇది నిన్ననే తీసిన వీడియో..” అని పర్వీన్ కాస్వాన్ తన పోస్టులో పేర్కొన్నారు.
  • ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఐదారు గంటల్లోనే 40 వేల వరకు వ్యూస్ నమోదవడం గమనార్హం. వేల కొద్దీ లైకులు కూడా వస్తున్నాయి.
  • ఎలుగుబంట్లు ఇలా చెట్లు ఎక్కేస్తే ఇక కాపాడుకోవడం ఎలాగంటూ కామెంట్లు వస్తున్నాయి.
  • ‘వామ్మో.. మనుషుల్లా ఇంత సింపుల్ గా చెట్లు ఎక్కేస్తున్నాయి’ అని మరికొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
  • ఇంకొందరైతే.. ‘ఎలుగుబంట్లు చెట్లు ఎక్కుతాయని ముందే తెలుసు, మేం చాలాసార్లు చూశాం’ అని కామెంట్ చేస్తున్నవారూ ఉన్నారు.


More Telugu News