ఆర్మూర్‌లోని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మాల్‌కు ఆర్టీసీ నోటీసులు

  • మాల్‌కు సంబంధించి రూ.3.14 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్న ఆర్టీసీ
  • నోటీసులు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ ఆంజనేయులు
  • సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు
  • బకాయిలను చెల్లించకుంటే మాల్‌ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టీకరణ
బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్‌కు ఆర్టీసీ నోటీసులు పంపించింది. బస్టాండ్ ప్రాంతంలోని మాల్‌కు సంబంధించి రూ.3.14 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆంజనేయులు నోటీసులు ఇచ్చారు. సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా బకాయిలను చెల్లించకుంటే మాల్‌ను స్వాధీనం చేసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మాల్‌కు ఆర్టీసీ గతంలోనూ నోటీసులు జారీ చేసింది.


More Telugu News