తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

  • నేడు ఉదయం 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • టోకెన్ లేని భక్తులకు 4 గంటల్లో దర్శనం
  • రూ.300 స్పెషల్ దర్శన్ టికెట్లు కొనుగోలు  చేసిన భక్తులకు 2 గంటల్లో దర్శనం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం కేవలం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. రూ.300 స్పెషల్  దర్శన్ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతోంది. 

తిరుమల శ్రీవారిని నిన్న 64,766 మంది దర్శించుకున్నారు. 24,158 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న బుధవారం ఒక్క రోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.09 కోట్ల ఆదాయం వచ్చింది.


More Telugu News